మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

surekha-03.jpg

తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం ఉదయం మరోసారి నోరు విప్పారు. కేటీఆర్ విషయంలో తాను వెనక్కి తగ్గేదేలేదని తేల్చేశారామె. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేస్తే న్యాయ పరంగా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌ తనపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు మంత్రి కొండా సురేఖ. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదన్నారు. అనుకోని సందర్భంలో ఒక కుటుంబాన్ని ప్రస్తావించడం అనుకోకుండా జరిగిందన్నారు. నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని మీడియా ముఖంగా తెలియజేశారు.

Share this post

scroll to top