పాన్ ఇండియా హిట్‌ ఇవ్వాలని సూర్య కలలు..

surya-05.jpg

తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్నా ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబిలు. మరి వాళ్ల ఆశ సూర్య అయినా తీరుస్తారా కంగువాతో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా అసలు కంగువా కోసం సూర్య చేస్తున్న ప్లాన్స్ ఏంటి ఇండియన్ సినిమాలో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ఉండేది. ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది.

కానీ ఇప్పుడలా కాదు టాలీవుడ్ టాప్ ప్లేస్‌కు వెళ్తే బాలీవుడ్ రెండో స్థానంలో తమిళ ఇండస్ట్రీ మూడో స్థానంలో ఉంది. వందల కోట్లు వసూలు చేస్తున్నా పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు. ఇప్పుడా లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు. పొన్నియన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తానంటున్నారు సూర్య. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కంటెంట్ చూస్తుంటే సూర్య నమ్మకంలో తప్పు లేదనిపిస్తుంది. విజువల్ వండర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు శివ.

Share this post

scroll to top