తిరుమలలో ప్రత్యక్షమైన దువ్వాడ..

duvada-07.jpg

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఎలక్ట్రిక్ స్కూటీ ప్రమోషన్‌లో భాగంగా ఇద్దరు హల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలను తనివీతీరా చూసేందుకు తిరుమలకు వెళ్లామని దువ్వాడ తెలిపారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు.

ప్రజలందరికి శాంతిసౌకర్యాలు చేకూర్చాలని శ్రీనివాస్ కోరుకున్నారు.దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో తమ ఇంట్లో అక్రమంగా ఉంటున్నారని ఆయన సతీమణి దువ్వాడ వాణి ఆరోపించారు. టెక్కలిలోని నివాసం ఎదుట కూతుళ్లతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. దీంతో ఈ వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు సద్దుమనిగిందనుకున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి కనిపించింది.

Share this post

scroll to top