యష్మీ నిఖిల్ మధ్యలో విష్ణుప్రియ..

bigg-boss-24-.jpg

బిగ్‌బాస్ టుడే ఎపిసోడ్‌లో నిఖిల్‌కి ఓ విషయం చెప్పింది విష్ణుప్రియ. నేను నిన్ను నామినేట్ చేశాననే కోపంతోనే యష్మీ నన్ను నామినేట్ చేసింది తెలుసా అంటూ విష్ణుప్రియ అంది. దీనికి తను చెప్పిందా నా కోసం నిన్ను నామినేట్ చేశా అని అంటూ నిఖిల్ అడిగాడు. అవును తనే చెప్పింది. నిఖిల్‌ని చేశాకనే నేను నిన్ను నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యా అంది అంటూ విష్ణు చెప్పింది. దీనికి అవునా నేను తమాషాగా చెప్పింది అనుకున్నా అంటూ నిఖిల్ అన్నాడు. కాదు నిన్ను నామినేట్ చేశాకే తన ఫేస్ ఛేంజ్ అయింది. పక్కకి తీసుకెళ్లి అడిగినప్పుడు నువ్వు నిఖిల్‌ని చేశాకే చేశారా అంది. అంటూ విష్ణుప్రియ చెప్పింది.

దీంతో ఎలాగైనా ఇది ప్రూ చేయాలని నిఖిల్ అటు ఇటూ తిరుగుతుండగానే కావాలని యష్మీ దగ్గరికెళ్లి మాట్లాడింది విష్ణు. నేను నిఖిల్‌ను నామినేట్ చేశానని నన్ను చేశావా అని అడిగింది. దీనికి లేదు అంటూ మాట మార్చింది యష్మీ. నాకు అదే చెప్పావ్‌గా అని విష్ణు అంటే కాదు నువ్వు చేసింది సీరియస్ నామినేషన్‌లా అనిపించలేదు అది చెప్పా నిఖిల్ చేశాడని కాదు అలా ఎందుకు చేస్తా అయినా నాకు ఇంకా బాండ్ స్ట్రాంగ్ అయిన తర్వాత మీ నేమ్స్ నామినేషన్స్‌లో తీసుకోలేను సో అందుకే ఇక ఫ్రెండ్స్‌ని నామినేట్ చేయను అనేది రాకుండా ఉండాలనే చేశా ఎందుకంటే కొన్ని వారాలు పోతే మా ఫ్రెండ్స్‌ది బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు నాకు వీళ్ల నేమ్స్ తీసుకోవడం నా వల్ల కాదు అంటూ యష్మీ చెప్పింది.

Share this post

scroll to top