చాక్లెట్స్ కొనిపిస్తానని మూడున్నరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..

thirupathi-02.jpg

తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి మిస్సింగ్‌ విషాదాంతమైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన యువకుడు నాగరాజు అలియాస్‌ సుశాంత్‌ పాపను చంపి పూడ్చిపెట్టాడు. విచారణలో యువకుడు ఇచ్చిన సమాచారం ప్రకారం పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. వడమాలపేట మండలం ఏఎం పురానికి చెందిన పసిపాపకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు యువకుడు నాగరాజు. పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే కేసును చేధించారు. నిందితుడు నాగరాజును పట్టుకున్నారు.

Share this post

scroll to top