లోకేష్‌ ని సీఎంని చేసే ప్రయత్నంలో చంద్రబాబు..

sai-reddy-04.jpg

మూడేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా అని, చంద్రబాబు లోకేష్‌ ని సీఎం చేసే ప్రయత్నంలో ఉన్నారా అని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై స్పందిస్తూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయపడుతోందని అన్నారు. జమిలి 2027లో ఎన్నికలు అంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా అని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, రేప్‌లు చూసి టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా అని పలు ఆరోపణలు చేశారు.

Share this post

scroll to top