ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బడ్జెట్ ను రూపొందించామన్నారు. 2024-25 బడ్జెట్ లో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది ఏపీ సర్కార్. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.11,855 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే చేతులకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. 2024-25 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులకు ముందు తమ ప్రభుత్వం వ్యవసాయ రంగంకోసం చేసిన కృషిని వివరించారు.