వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి నుండి వైసిపి సభ్యులు వాకౌట్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు వైసిపి సభ్యులు. గతంలో నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా డయేరియా ప్రబలిందన్న బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఐదు నెలల కాలంలో ఎందుకు త్రాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.