ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పై తాజాగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. గతంలో ట్విట్టర్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పొస్టింగులపై స్థానిక కౌన్సిలర్ ఫిర్యాదుతో ఓ కేసు నమోదు చేసిన విషయం విదితమే కాగా ఇవాళ దానికి సంబంధించి ఓ నోటసు ఇచ్చారు. దీంతో పాటు ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఉన్న మరో మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 41 సీఆర్పీసీ కింద ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు నోటీసులు ఇచ్చారు. యర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందచేశారు.