ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు నేటి ఉదయం నుంచి కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈసీ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని అనుకుంటున్నాం ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదని పేర్కొన్నారు. తమ కార్యకర్తలు అన్ని బూత్‌లను పరిశీలిస్తున్నారు. అన్ని చోట్లా వీడియోగ్రఫీ కొనసాగుతుందన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక అని అఖిలేష్ యాదవ్ తెలిపారు.