ప్రముఖ సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని మురళికృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే పోసాని రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. గురువారం సాయంత్రం ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలను వదిలివేస్తున్నానని వెల్లడించారు. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోనని స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ కూడా ఓటర్‌గానే ప్రశ్నించానని, మంచి చేసే వాళ్లకు మద్దతిచ్చానని అన్నారు. వైసీపీనే కాదు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని పేర్కొన్నారు. నన్ను ఎవరు ఏమి అనలేదు. ఎవరూ బెదిరించలేదని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు,పవన్‌కల్యాణ్, నారా లోకేష్‌పై విరుచుకు పడేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోసానిపై పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.