నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 22 తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ తోపాటు తెలంగాణ సీఎస్, హోంశాఖ అధికారికి నోటీసులు జారీచేసినప్పటికీ శుక్రవారం వారు విచారణకు హాజరు కాలేదు. దీంతో వారికి వ్యతిరేకంగా కోర్టు ఎక్స్‌పార్టే ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆ ముగ్గురు కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు ప్రకటించింన న్యాయస్థానం తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.