మహారాష్ట్రలో ట్రెండ్‌ సెట్‌ చేసిన పవన్‌..

pspk-23-.jpg

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహించిన సంగతి విదితమే బహిరంగ సభల్లో రోడ్‌షోలలో పాల్గొన్నారు పవన్‌. అయితే, పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. బల్లార్‌పూర్‌, పుణె, డెగ్లూర్‌, షోలాపూర్‌, లాతూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ ప్రచారానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం విదితమే పవన్‌ ఎక్కడికి వెళ్లినా OG.. OG అంటూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతే కాదు మేము ట్రెండ్ ఫాలో కాము ట్రెండ్ సెట్ చేస్తాం అంటూ పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు..

Share this post