బోనస్‌ అక్రమాలకు ఇక నుంచి ఐరిస్‌తో చెక్‌..

ravanth-reddy-25-.jpg

వరిలో 33 రకాల సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ గా రూ. 500 లు ప్రకటించిన నేపథ్యంలో బోగస్‌ను నియంత్రించేందుకు ఐరిస్‌ విధానాన్ని అమలు చేయబోతుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అధికంగా కిన్నెరసాని, తాలిపేరు, మూకమామిడి, పెద్దవాగు ప్రాజెక్టులు, చెరువుల కింద 1.64లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు సమాచారం. బోనస్​ ప్రకటించిన వేళ ఏపీ, చత్తీస్​గఢ్​ సరిహద్దుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అక్రమంగా రాకుండా అడ్డుకునేందుకు చెక్​పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. 

ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలనే నిబంధన అయితే ఉంది. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్​ కాఫర్​లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్​ ఏఈవోలు, సహకార సంఘం, వ్యవసాయ మార్కెటింగ్​, జిల్లా గ్రామీణాభివృద్ధి  శాఖ ఆఫీసర్లకు ఇప్పటికే ట్రైనింగ్​ఇచ్చారు. ఏఈవోలు సన్నాలుగా గుర్తించి ధ్రువీకరిస్తారు. 

Share this post

scroll to top