ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఈ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ చేరుకున్నారు పవన్ కల్యాణ్. అయితే, ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలపై చర్చించనున్నారు. ముందుగా మరికాసేపట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో భేటీ కానున్నారు పవన్ కల్యాణ్. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఆయనకు కేంద్ర మంత్రులు ఇచ్చిన అపాయింట్మెంట్లను ఓసారి పరిశీలిస్తే మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు పెండింగ్ అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. సాయంత్రం 4:30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇక, సాయంత్రం 5:15 గంటలకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీకానున్నారు పవన్ కల్యాణ్ మరోవైపు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.