చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇక అమరావతే శాశ్వతం..

amaravathi-27-.jpg

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇకపై ఏపీ రాజధాని అమరావతిపై ఎలాంటి అపోహలు లేకుండా ఉండేలా శాశ్వత రాజధానిగా అమరావతే ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి గెజిట్ రప్పించే యత్నాలు చేస్తున్నారు. గెజిట్ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు.

Share this post

scroll to top