అందానికి  గ్రీన్ టీ మేలు చేస్తుంది..

face-pack-5.jpg

ఇటీవల గ్రీన్‌ టీ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహన నేపథ్యంలో చాలా మంది రెగ్యులర్‌ టీకి బదులుగా గ్రీన్‌ టీని తీసుకుంటున్నారు. గ్రీన్‌టీలోని యాంటీ యాక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రీన్‌ టీ తాగిన తర్వాత ఆ బ్యాగ్‌లను పడేస్తుంటాం. కానీ వాటిని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

గ్రీన్‌ టీ ఫేస్‌ ప్యాకతో చర్మానికి సహజమైన కాంతిని అందిస్తాయి. ముల్తానీ మట్టి, పసుపు, బియ్యప్పిండి, అరటిపండుతో గ్రీన్ టీని ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. మొటిమలను తగ్గించడంలో, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, గ్రీన్‌ టీ కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముల్తానీ మట్టిలో హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చేసుకోవాలి. అలాగే డెడ్ స్కిన్, ఎక్సెస్ ఆయిల్‌ను తొలగిస్తాయి.

బియ్యంపిండిలో గ్రీన్‌ టీ కలుపుకొని ఫేస్‌కు అప్లై చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇందుకోసం 2 టీస్పూన్ల బియ్యం పిండిలో 1 టీస్పూన్ నిమ్మరసం, గ్రీన్ టీ కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్‌ చేసుకోండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖం నిగారిస్తుంది. గ్రీన్‌ టీలో పసుపు కలుపుకుని తీసుకోవడం వల్ల ముఖంపై మురికి తొలగిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ప్యాక్‌తో ముఖానికి అప్లై చేసుకోవాలి. వారానికి రెండు సార్లు పసుపు, గ్రీన్‌ టీ ఫేస్‌ ప్యాక్‌ ముఖానికి అప్లై చేసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

Share this post

scroll to top