రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు..

sand-9.jpg

రాజమండ్రిలోని కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, హేవలాక్ బ్రిడ్జిల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఇసుక పడవలను సీజ్ చేశారు. ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇచ్చినప్పటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా పలు చోట్ల తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.

అలాగే, రాజమండ్రిలోని ధోబి ఘాట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ దగ్గర 10 పడవల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ ను ఆకస్మిక తనిఖీలు చేసి సీజ్ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు వెల్లడించారు. కొందరు బోట్స్ మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువుగా నీరు ఉందని సాకు చెబుతు ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 బోట్స్ ను సీజన్ చేయడం జరిగిందన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు.

Share this post

scroll to top