రాములమ్మ మౌనం వెనుక కారణం ఏంటంటే..

vijayasanthi-9.jpg

సినీ పరిశ్రమలో విజయశాంతి ఓ వెలుగు వెలిగారు. పెద్ద హీరోలతో పాటు అడపాదడపా యంగ్ స్టార్ తో కూడా లీడ్ రోల్ ను తళ్లుక్కుమన్నారు. సినిమాల్లో హిట్ అయిన ఆమె రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. లేడీ ఓరియంటెండ్ సినిమాల్లో విలన్స్ ను చిత్తుచేసిన ఆమె పొలిటికల్ ప్రత్యర్దులను ఎదుర్కొలేకపోయారు. ప్రస్తతం కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఆమె మనస్సులో ఏముందంటే రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకపోతే నెట్టుకురావడం చాలా కష్టం కొందరు అదృష్టం మీదనో లేకపోతే పొలిటికల్ స్టాటజీలతోనో రాణిస్తుంటారు. కానీ కొందరు కనుమరుగవుతుంటారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై విజయశాంతి గతంలో ఓ వెలుగు వెలిగారు.

భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్.కే.అద్వానీకి దగ్గరగా పనిచేసి ఆయన చేసిన రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసవ పోరాటం చేశారు. కొద్దిరోజుల తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి కేసీఆర్ తో నడిచారు. కేసీఆర్ ఆమెను చెల్లిగా అభివర్ణించారు. పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీగా ఆమె గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. 2018లో కాంగ్రెస్ పార్టీ చేరి ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు.

Share this post

scroll to top