ఆశా వ‌ర్క‌ర్ల‌పై పోలీసుల దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం ..

asha-worker-9.jpg

కోఠి డీఎంఈ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన ఆశా వ‌ర్క‌ర్ల ప‌ట్ల పోలీసులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. ఆశా వ‌ర్క‌ర్ల కొంగులు లాగుతూ తాక‌రాని చోట తాకుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. అంతేకాకుండా ఆశాల‌పై చేయి చేసుకున్నారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌ల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ ఆశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Share this post

scroll to top