అల్లు అర్జున్‌కు ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయమా..

pallu-13-.jpg

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. వెంటనే అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని.. లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం తనకు వచ్చి హక్కుతో కోర్టులో రేపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్‌ చేశారు. తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు సరే చంద్రబాబు పొలిటికల్‌ ర్యాలీలు నిర్వహించినప్పుడు ఎంతోమంది చనిపోయారని అప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కేఏ పాల్‌ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు ర్యాలీ నిర్వహిస్తే 8 మంది మరణించారు గుంటూరులో ముగ్గురు చనిపోయారు గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు స్టంట్‌ చేసినప్పుడు తొక్కిసలాట జరిగి 23 మంది చనిపోయారని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారా? ఆయన్ను స్టేషన్‌కు తీసుకొచ్చారా? ఆయన్ను విచారించారా? అని నిలదీశారు.

Share this post

scroll to top