రేవతి కుటుంబానికి అండగా ఉంటా..

revathi-14-.jpg

సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ కేసులో శుక్రవారం అరెస్ట్‌ అయిన ఆయన బెయిల్‌ మంజూరు అయిన తగిన సమయానికి బెయిల్‌పత్రాలు జైలుకు చేరుకోకపోవడంతో చంచల్‌గూడ జైలులోనే గడపాల్సి వచ్చింది బన్నీ. ఇక, ఈ రోజు ఉదయమే 6.30 గంటలకు జైలు నుంచి విడుదలైన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. వారిని ఓదార్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు.

Share this post

scroll to top