కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే 2024 పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక విధనంకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఓ కమిటీని వేసిన కేంద్ర ఆ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో నేడు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును మరికొద్ది సేపట్లో లోక్‌సభలో కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాలే ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపనున్నారు.
బిల్లు ఆమోదానికి కేంద్రానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. కానీ ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు ఏవైనా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో లోక్ సభలోని తమ పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. మొత్తం మూడు లైన్ లతో కూడిన విప్ జారీ చేయగా ఆ పార్టీ ఎంపీలు మొత్తం రాత్రికి రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు.