ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు..

ktr-19-1.jpg

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్ర‌యివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచార‌ణ జ‌రిపేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఇటీవ‌ల అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితో త‌దుప‌రి చ‌ర్యల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ ఉప‌క్ర‌మించింది.

Share this post

scroll to top