టార్గెట్‌ దంగల్‌, బాహుబలి అంటున్న అల్లు అర్జున్‌ ..

pushppa-20.jpg

భారీ అంచనాల మధ్య విడుదలై ఎప్పటిలాగే సౌత్‌తోపాటు నార్తిండియన్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు పుష్పరాజ్‌. ఐకాన్‌ అల్లు అర్జున్‌ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌ డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై న పుష్ప 2 ది రూల్‌ ఓపెనింగ్‌ డేనే జవాన్‌, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును బద్దలు కొట్టిందని తెలిసిందే. తాజా కలెక్షన్ల రిపోర్ట్‌తో పుష్పరాజ్ మేనియా ఎలా ఉందో అర్థమవుతోంది.

పుష్పరాజ్‌ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. 15 రోజుల్లోనే రూ.1508 కోట్లు వసూళ్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ మార్క్ చేరుకున్న చిత్రంగా అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇప్పటివరకు ఆల్‌ టైమ్‌ హయ్యెస్ట్‌ గ్రాస్‌ ఇండియన్ మూవీస్‌ అమీర్‌ ఖాన్‌ దంగల్‌ రూ.2070. 30 కోట్లు, బాహుబలి ది కంక్లూజన్‌ రూ.1786.06 కోట్లు పేర్లతో ఉన్న రికార్డ్‌ను పుష్ప 2 ది రూల్‌ అధిగమించడం ఖాయమని తాజా కలెక్షన్లు చెప్పకనే చెబుతున్నాయి. పుష్ప 2 మరికొన్ని రోజుల్లోనే ఈ ఫీట్‌ చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు.

Share this post

scroll to top