శాసనసభను పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడారు. సమయం 10:10 కావొచ్చింది. ఈ సెషన్లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ పది అంటే పది గంటలకు ప్రారంభం కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి పదేండ్లు సభ నడిపితే పది అంటే పది గంటలకు కచ్చితంగా ఠంచన్‌గా సభ నడిపాం. సభ సమయ పాలన పాటించడం ముఖ్యం. ప్రతి రోజు ఈ సెషన్లో 5, 10, 15 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభం కావడం కరెక్ట్ కాదు. సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి. మనమే ఇలా ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదని మనవి చేస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు.