ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. దసరా, దీపావళి అంటూ ప్రతి పండక్కి వాయిదాలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సంక్రాంతికి పక్కాగా ఉచిత బస్సు ప్రయాణిమిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అది కాస్త ఉగాదికి వాయిదా పడింది. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు.
ఈ సంక్రాంతికి కూడా మహిళలకు ఫ్రీ బస్సు లేనట్టే..
