ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండు చేశారు. నమ్మకానికి, మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. మంగళవారం విశాఖలోని వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
రెండెకరాల బాబూ వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు..
![amarnadh-31.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2024/12/amarnadh-31.jpg)