పైకి చూస్తే యాపిల్ పండ్ల లోడ్..

guntur-02.jpg

గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం రవాణా తీవ్ర కలకలాన్ని రేపింది. యాపిల్ పండ్ల వ్యాపారం మాటున పక్క రాష్ర్టాల మద్యం తరలింపు వ్యవహారం గుట్టురట్టు అయింది. మినీ లారీలో యాపిల్ పండ్ల చాటున పక్క రాష్ర్టాల మద్యం అమ్ముతూ ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు పట్టుబడ్డారు. మంగళగిరి మానస సరోవర్ వద్ద మాటు వేసి నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బొడ్డపాటి బాలక్రిష్ణ, ముండ్రు మస్తాన్ రావు, అనపర్తి ఏసోబు అని గుర్తించారు స్పెషల్ ఎక్సైజ్ పోలీసులు. చండీగఢ్ ,పంజాబ్ రాష్ర్టాల నుంచి గతంలో అనేకసార్లు మినీ లారీలో తెచ్చి అమ్మినట్లు ఉన్నతాధికారుల విచారణలో ఒప్పుకున్నారు ముఠా కీలక సూత్రధారులు.

Share this post

scroll to top