కుంభ మేళా కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్ నుంచి తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్లు కేటాయించింది యూపీ సర్కార్. 50 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.