టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

cbn-03.jpg

నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్‌లకు అవకాశాలు, భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్. ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్‌ను ఆకర్షించాయి. అయితే ఇటీవల సంధ్య థియేటర్ ఘటన తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన అవకాశాల వల్లే టాలీవుడ్‌కు ఇప్పుడు హైదరాబాద్ హబ్​గా మారిందన్నారు సీఎం చంద్రబాబు.

ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందన్నారు. టాలీవుడ్‌కు అమరావతిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే టాలీవుడ్‌ను ప్రోత్సహించడానికి అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి వేదిక కాబోతోందని హైదరాబాద్‌లో మాదిరిగానే అమరావతిలో పెద్ద పెద్ద స్టూడియోలు వస్తాయనీ ఏపీలో అధిక సంఖ్యలో షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందనీ టాక్ ఆప్ ది టాలీవుడ్.

Share this post

scroll to top