హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం సంతకాల సేకరణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత సంతకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కర్నాటక, బిహార్ వంటి విఫలయత్నాల అనుభవాలు ఉన్నా కూడా తొలుత డేడికేటెడ్ కమిషన్ వేయాల్సిందని కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదని తెలిపారు.
నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..
![kavitha-03.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/kavitha-03.jpg)