పోలీస్ క్యారెక్టర్లో నటించాలన్నది నా డ్రీమ్. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర లభించడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది మీనాక్షి చౌదరి. అనతికాలంలోనే తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా శుక్రవారం మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడింది. తాను ఇప్పటివరకు కామెడీ జోనర్ సినిమా చేయలేదని, తొలిసారి ఈ తరహా పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశానని, ఆ ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది.