కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారి నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిగారు, ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారితో కలిసి ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.