ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. చర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉంది. రాష్ట్ర ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు అవసరమన్నారు. చర్లపల్లి టెర్మినల్‌తో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని మోదీ వివరించారు. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యమని రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోందన్నారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లును ప్రవేశపెట్టామని త్వరలోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుందని తెలిపారు.
త్వరలోనే భారత్‌లో బుల్లెట్ ట్రైన్..
![modi-06.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/modi-06.jpg)