ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA మజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్‌రెడ్డి లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా బీఎల్‌ఎన్‌రెడ్డి A3గా ఉన్నారు. అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి లను ఎలాంటి ప్రశ్నలు సంధించాలో అధికారులు ప్రశ్నావలిని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం రేపు అంటే జనవరి 09వ తేదీన అరవింద్ కుమార్ ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా 10 తేదీన బీఎల్‌ఎన్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈడీ అధికారులు వీరికి నోటీసులు కూడా జారీ చేశారు. వాస్తవానికి వీరిద్దరి ఈడీ విచారణ జనవరి 03,04వ తేదీల్లోనే జరగాల్సి ఉండగా వీరు విచారణకు హాజరు కాలేదు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణలు చేపట్టాయి.
ఇవ్వాళ ఏసీబీ విచారణకు ఆ ఇద్దరు..
![e-camars-08.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/e-camars-08.jpg)