తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, ఆర్కే రోజా అంతేకాదు దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు. మూడు రోజులు అయ్యింది, ఎందుకు పట్టించు కోవడం లేదు? సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీతో సహా అందరిపై కేసు నమోదు చేయాలన్నారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి ఇంకా బుద్ధిరాలేదన్న ఆమె దీనికి కారణమైన వారిని ఇంకా కాపాడాలి అని చూస్తున్నారు. హిందువులు అనే గౌరవం లేదా? భక్తులు ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు.