డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

balakrishna-13-.jpg

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. తొలిరోజే సెన్సెషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది డాకు మహారాజ్. మొదటి రోజే యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అమెరికాలో నిన్న ఒక్కరోజే 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ డాకు మహారాజ్ మూవీ అదరగొట్టింది. నివేదికల ప్రకారం ఈ సినిమా నైజాం ఏరియాలో రూ.4. 7 కోట్లు వసూలు చేసింది. అలాగే క్యాడీడ్ రూ.5.25 కోట్లు, యూఏలో రూ.1.92 కోట్లు, గుంటూరు రూ.4 కోట్లు, క్రిష్ణ రూ.1.86 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.1.95 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 1.75 కోట్లు నెల్లూరులో రూ.1.51 కోట్లు రాబట్టినట్లుగా సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.22.31 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటిరోజే భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే అమెరికాలో టికిట్స్ ప్రీ సేల్స్ లో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో పదివేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. అమెరికాలోని దాదాపు 125 లోకేషన్లలో 350 షోలు ఫస్ట్ రోజే ప్రదర్శించారు.

Share this post

scroll to top