తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అయితే వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరుగకుండా చూసింది.