దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి..

lakshmi-parvathi-19-.jpg

దివంగత ఎన్టీఆర్ మరణానంతరం కూడా గత 30 ఏళ్లుగా నాపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని ఇప్పటికి కూడా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి వాపోయారు. నిరంతరం సాగుతున్న ఈ పోరాటం ఎన్నాళ్లు సాగుతుందో తెలియదని ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయన్నారు.

నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదని..అందరి సమక్షంలోనే లక్షలాది మంది ప్రజల మధ్య ప్రకటించి మరి ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారన్నారు. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశానని ఒక రూపాయి కూడా ఆశించలేదని ఆయన ఆరోగ్యం కోసం, అధికారంలోకి రావడం కోసం కృషి చేశానని గుర్తు చేసుకున్నారు. కళ్ల ముందు ఎన్నో అకృత్యాలు జరుగుతున్నా నేను ఏం చేయలేకపోతున్నానని వాపోయారు.

Share this post

scroll to top