రీసెంట్‌గా సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల విషయంపై నటి ఊర్వశీ రౌతేలా ని కూడా స్పందించమని మీడియా వర్గాలు కోరగా ఈ భామ ఆ దాడి గురించి స్పందించకుండా తాను తెలుగులో నటించిన ‘డాకు మహారాజ్ అనే సినిమాతో రూ.100 కోట్ల మూవీ అందుకున్నానని ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కారణంగా తన తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందని, తండ్రి ఒక రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చాడని టాపిక్ డైవర్ట్ చేసేసింది. దీంతో సైఫ్ అభిమానులతో పాటు నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇక విషయం అర్థం చేసుకున్న ఊర్వశీ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ నోట్ రాసుకొచ్చింది. ‘హృదయ పూర్వకంగా నేను క్షమాపణలు చెబుతున్నాను.
నాకు ఇప్పటి వరకు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి విషయంలో సీరియస్ నెస్ అర్థం కాలేదు. నా మీద నాకే సిగ్గుగా ఉంది, డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో నాకు వచ్చిన గిఫ్ట్‌ల గురించి మాట్లాడటం కరెక్ట్ అని అనిపించడం లేదు. మీ గురించి అడిగితే మాట్లాడకుండా డాకు మహారాజ్ సక్సెస్ కారణంగా నేను దాని గురించి మాట్లాడాను, దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి. మీ విషయంలో నేను చాలా మూర్ఖంగా ఇన్ సెన్సిటివ్‌గా వ్యవహరించాను. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నా తరఫునుంచి ఏమైనా సహాయం కావాలంటే అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దు. మీ గురించి అడిగితే డాకు మహారాజ్ గురించి మాట్లాడినందుకు మరోసారి క్షమించండి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.