అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి, నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతకు మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిందనుకున్నారు. కానీ మరోసారి తెరపైకి వచ్చింది. తనపై జేసీ చేసిన అసభ్య వ్యాఖ్యలను నటి, బీజేపీ నాయకులు నటి మాధవి మర్చిపోలేదు. ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని భావించారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్సీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని తెలిపారు. అందుకే మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదుచేశానని చెప్పారు. ‘మా’ ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారన్నారు. తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిత్వ హననడం చేయడం దారుణమని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.