బాలీవుడ్‌ లో అసలేంజరుగుతోంది..

bolly-wood-20.jpg

గతేడాది అక్టోబర్‌ 12న ఎన్సీపీ నేత, మాజీ మంత్రి సల్మాన్‌ఖాన్‌ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని కాల్చిచంపేశారు దుండగులు. సిద్ధిఖీ ఇంటి దగ్గరే అతనిపై ఎటాక్‌ జరిగింది. ఆ తర్వాత సిద్ధిఖీ మర్డర్‌ తమ పనేనని ప్రకటించుకుంది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్. బాబా సిద్ధిఖీ మర్డర్‌ తర్వాత బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అనేకసార్లు సల్మాన్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయ్‌. సల్మాన్‌ ఇంటిపై కాల్పులు కూడా జరిగాయ్‌. త్వరలోనే సల్మాన్‌ను చంపేస్తామంటూ హెచ్చరికలు పంపింది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ ఇప్పుడు సైఫ్‌ అలీఖాన్‌పై అతని ఇంట్లోనే ఎటాక్ జరగడంతో బాలీవుడ్‌ ఉలిక్కిపడింది. ఎవరు ఎందుకు ఎటాక్‌ చేశారో తెలియకపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Share this post

scroll to top