పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని తపించిపోతున్నామన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ నేతలకు కోరికగా ఉందని తెలిపారు. ఎవరి కోరికలు వారికి ఉంటాయని తెలిపారు జనసేన నేత కిరణ్ రాయల్. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామని లోకేష్ ను డిప్యూటీ పదవీలో చూడాలని టిడిపి కేడర్ కోరుకోవడంలో తప్పదులేదన్నారు. మాకు పవన్ కల్యాణ్ ను సిఎం గా చూడాలని పదేళ్ళ గా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.