తెలంగాణకు విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి..

cm-ravanth-23-.jpg

తెలంగాణకు విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2.35కు ఆయన జ్యూరిచ్ నుంచి దుబాయ్‌ కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా శుక్రవారం ఉదయం 8.25కు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణ‌ ను ఇండస్ట్రిల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు బృందం పలు విదేశీ కంపెనీ ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ పెవిలియన్‌ లో సీఎం రేవంత్, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ‌ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా హైదారబాద్‌ లోని గోపన్‌పల్లి లో కొత్త విప్రో సెంటర్‌ ను ఏర్పాటు చేయబోతున్నామని రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు. అందుకు సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

Share this post

scroll to top