బీపీతో బాధ పడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..

high-bp-24-.jpg

ఈ రోజుల్లో దీర్ఘకాలిక వ్యాధులు చాలా కామన్ అయిపోయాయి. బీపీ, షుగర్‌ వ్యాధులు ఎక్కువైపోయాయి. పది మందిలో ఐదుగురు ఖచ్చితంగా బీపీ, డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీ ఎక్కువ అయ్యేంత వరకు కూడా ఈ వ్యాధి బయట పడదు. బీపీతో బాధ పడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదంగా వైద్యులు చెబుతూ ఉంటారు. బీపీ ఉన్నవారు ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైసీ అండ్ సాల్ట్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. బీపీతో బాధ పడేవారు చాట్ మసాలా ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఇది గుండెపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చాట్ మసాలాని దూరం పెట్టండి. అదే విధంగా పచ్చళ్లకు కూడా చాలా దూరంగా ఉండాలి. నిల్వ పచ్చళ్లు తినడం వల్ల రక్త పోటు అనేది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. హైబీపీతో బాధ పడేవారు రెడ్ మీట్‌కి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ని పెంచుతుంది. దీంతో గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే వీటిల్లో ఇప్పుడు సాల్టెడ్ నట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిని తీసుకునేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి కూడా దూరంగా ఉండాలి.

Share this post

scroll to top