టీడీపీ ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ పెద్ద పప్పు సుద్ద అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మీ నాన్నని చూసి అందరు నీకు గౌరవిస్తున్నారని లోకేష్ తెలుసుకోవాలని గుర్తు పెట్టుకోవాలన్నారు. నీవు కోడిగుడ్డు అని ఎద్దేవా చేసిన మా నాయకుడు అమర్నాథ్ ఓ మాజీ మంత్రి కొడుకు అని వాళ్ల నాన్న లేకపోయినా అమర్నాథ్ తగిన గౌరవం పొందుతున్నాడని అంబటి స్పష్టం చేశారు. కాని నీవు మీ తండ్రి లేకపోతే సుద్ద పప్పువని లోకేష్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడారు. లోకేష్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైసీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేరని జగన్ ఆనాడే చెప్పారన్నారు. ఇవ్వాళ చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడని మాట్లాడుతున్నాడని రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని, వైసీసీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశాడని ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనే వైసీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని చంద్రబాబుఎలా చెబుతారని రాంబాబు నిలదీశారు.