కేంద్ర మంత్రులకు తృటిలో తప్పిన ప్రమాదం..

unioun-minister-30.jpg

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. మొదట విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస్ వర్మకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు ఎంపీలు భరత్, అప్పల నాయుడు, బీజేపీ నేతలు తదితరులు ఉక్కు పరిశ్రమకు రూ. 11,440 కోట్ల కేంద్ర ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రావడంతో వెల్‌కమ్‌ చెప్పారు.. అయితే, ఎయిర్‌పోర్ట్‌ నుంచి స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తున్న సమయంలో షీలా నగర్ వద్ద కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఎనిమిది వాహనాల కాన్వాయ్‌లో మూడు కార్లు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ధ్వంసమైన కారులో మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు కూడా ఉంది.

Share this post

scroll to top