మరికాసేపట్లో ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఉదయం 11గంటలకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే, దీనిపై పేద, మధ్యతరగతి, వేతనజీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ లో యువత, మహిళల కోసం ఎలాంటి పథకాలను కేంద్రం ప్రకటించబోతున్నారు? వ్యవసాయ రంగం, రైతులపై ఎలాంటి వరాలను కురిపిస్తారు. ఉదయం 11గంటలకి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2025 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ పై వేతన జీవుల్లో పెరుగుతున్న ఆశలు ట్యాక్స్ శ్లాబుల్ని 6 నుంచి 3కి కుదించే అవకాశం గరిష్ట పన్ను రేటు 30 నుంచి 25 శాతానికి తగ్గించే ఛాన్స్ స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ పెంచే అవకాశం పీఎం సూర్య ఘర్ బిజ్లీ పథకానికి కేటాయింపులు పెంచే ఛాన్స్.