తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..

election-03.jpg

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు.

Share this post

scroll to top